సచిన్, అజహర్‌లకు ఏం చెప్పాలో తెలియలేదు.. మ్యాచ్ ఫిక్సింగ్ సమయంలో కెప్టెన్సీపై ఆసక్తికర విషయాలు చెప్పిన గంగూలీ
- మ్యాచ్ ఫిక్సింగ్ సంక్షోభ సమయంలో కెప్టెన్సీ చేపట్టినప్పటి అనుభవాలను పంచుకున్న గంగూలీ
- ఫిక్సింగ్ గురించి తనకు ఏమీ తెలియదని, సచిన్, ద్రావిడ్‌లను అడిగినట్లు వెల్లడి
- తొలిసారి టీమ్ మీటింగ్‌లో మాట్లాడటానికి చాలా భయపడినట్లు ఒప్పుకున్న గంగూలీ
- సచిన్, అజహర్ వంటి సీనియర్లకు సూచనలు ఇవ్వడానికి ఇబ్బందిపడ్డానని వ్యాఖ్య
- తొలి మ్యాచ్ గెలిచి, ఆ తర్వాత సెంచరీ చేయడంతో అంతా సర్దుకుందని గుర్తుచేసుకున్న దాదా
భారత క్రికెట్ జట్టు రూపురేఖలను మార్చిన గొప్ప కెప్టెన్లలో ఒకరిగా పేరుగాంచిన సౌరవ్ గంగూలీ, తన కెప్టెన్సీ తొలి రోజుల నాటి అనుభవాలను పంచుకున్నాడు. 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంతో భారత క్రికెట్ తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు జట్టు పగ్గాలు చేపట్టిన దాదా, ఆ సమయంలో తన మానసిక పరిస్థితి ఎలా ఉండేదో ఒక పాడ్‌కాస్ట్‌లో వివరించాడు. డ్రెస్సింగ్ రూమ్‌లోకి కూడా పాకిన ఫిక్సింగ్ ఆరోపణల గురించి, సీనియర్ ఆటగాళ్లతో మాట్లాడటానికి తాను ఎంత భయపడ్డానో ఆయన గుర్తుచేసుకున్నాడు.
రాజ్ షమానీ పాడ్‌కాస్ట్‌లో గంగూలీ మాట్లాడుతూ.. "నేను కెప్టెన్ అయ్యే ముందు జట్టులో బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి సమస్యలు ఉన్నాయని అనేవారు. కానీ, నిజానికి నాకు వాటి గురించి ఏమీ తెలియదు. అసలు ఇలాంటివి జరుగుతాయా? అని నేను సచిన్, ద్రావిడ్‌లను అడుగుతూ ఉండేవాడిని. నన్ను ఎవరూ సంప్రదించలేదు కాబట్టి, 'నిన్నెవరైనా అడిగారా?' అని సచిన్‌ను అడిగాను. లేదని చెప్పాడు. అనిల్ కుంబ్లేను అడిగినా అదే సమాధానం వచ్చింది. నాకు దాని గురించి పెద్దగా అవగాహన లేదు" అని వెల్లడించాడు.
కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించినప్పుడు తన వయసు కేవలం 27 ఏళ్లేనని గంగూలీ గుర్తుచేసుకున్నాడు. అప్పటికే జట్టులో మహ్మద్ అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలు ఉండేవారని, గతంలో వారి కెప్టెన్సీలో ఆడిన తాను, వారికి సూచనలు ఎలా ఇవ్వాలోనని చాలా ఆందోళన చెందానని తెలిపాడు. "నాకు ఇప్పటికీ గుర్తుంది, మా మొదటి మ్యాచ్ కొచ్చిలో జరిగింది. దానికి ముందు రోజు టీమ్ మీటింగ్‌లో నేను మాట్లాడాలి. ఈ విషయాన్ని నా భార్య డోనాతో చెప్పి, 'అజహర్, సచిన్ వంటి వాళ్లు నాకు కెప్టెన్లుగా ఉన్నారు. ఇప్పుడు నేను వాళ్లకు ఏం చెప్పాలి?' అని చాలా భయపడ్డాను" అని అన్నాడు.
"ఆ భయంతోనే టీమ్ మీటింగ్‌ను వీలైనంత త్వరగా ముగించాలని నిర్ణయించుకున్నా. కేవలం 15 నిమిషాల్లోనే కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి సమావేశాన్ని ముగించాను. ఆ తర్వాత రోజు మేము మ్యాచ్ గెలిచాం. ఆ తర్వాతి మ్యాచ్‌లో నేను సెంచరీ చేశాను. నెమ్మదిగా అన్నీ చక్కబడ్డాయి" అని గంగూలీ తన కెప్టెన్సీ ప్రస్థానం ఎలా ప్రారంభమైందో వివరించాడు.